మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Vakratunda Ganesha Stavaraja – వక్రతుండ గణేశ స్తవరాజః

అస్య గాయత్రీ మంత్రః |
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి | తన్నో దంతిః ప్రచోదయాత్ ||

ఓంకారమాద్యం ప్రవదంతి సంతో
వాచః శ్రుతీనామపి యం గృణంతి |
గజాననం దేవగణానతాంఘ్రిం
భజేఽహమర్ధేందుకళావతంసమ్ || 1 ||

పాదారవిందార్చన తత్పరాణాం
సంసారదావానలభంగదక్షమ్ |
నిరంతరం నిర్గతదానతోయై-
-స్తం నౌమి విఘ్నేశ్వరమంబుదాభమ్ || 2 ||

కృతాంగరాగం నవకుంకుమేన
మత్తాలిజాలం మదపంకమగ్నమ్ |
నివారయంతం నిజకర్ణతాలైః
కో విస్మరేత్పుత్రమనంగశత్రోః || 3 ||

శంభోర్జటాజూటనివాసిగంగా-
-జలం సమానీయ కరాంబుజేన |
లీలాభిరారాచ్ఛివమర్చయంతం
గజాననం భక్తియుతా భజంతి || 4 ||

కుమారముక్తౌ పునరాత్మహేతోః
పయోధరౌ పర్వతరాజపుత్ర్యాః |
ప్రక్షాలయంతం కరశీకరేణ
మౌగ్ధ్యేన తం నాగముఖం భజామి || 5 ||

త్వయా సముద్ధృత్య గజాస్య హస్తా-
-ద్యే శీకరాః పుష్కరరంధ్రముక్తాః |
వ్యోమాంగణే తే విచరంతి తారాః
కాలాత్మనా మౌక్తికతుల్యభాసః || 6 ||

క్రీడారతే వారినిధౌ గజాస్యే
వేలామతిక్రామతి వారిపూరే |
కల్పావసానం పరిచింత్య దేవాః
కైలాసనాథం శ్రుతిభిః స్తువంతి || 7 ||

నాగాననే నాగకృతోత్తరీయే
క్రీడారతే దేవకుమారసంఘైః |
త్వయి క్షణం కాలగతిం విహాయ
తౌ ప్రాపతుః కందుకతామినేందూ || 8 ||

మదోల్లసత్పంచముఖైరజస్ర-
-మధ్యాపయంతం సకలాగమార్థమ్ |
దేవానృషీన్భక్తజనైకమిత్రం
హేరంబమర్కారుణమాశ్రయామి || 9 ||

పాదాంబుజాభ్యామతివామనాభ్యాం
కృతార్థయంతం కృపయా ధరిత్రీమ్ |
అకారణం కారణమాప్తవాచాం
తం నాగవక్త్రం న జహాతి చేతః || 10 ||

యేనార్పితం సత్యవతీసుతాయ
పురాణమాలిఖ్య విషాణకోట్యా |
తం చంద్రమౌళేస్తనయం తపోభి-
-రావాప్యమానందఘనం భజామి || 11 ||

పదం శ్రుతీనామపదం స్తుతీనాం
లీలావతారం పరమాత్మమూర్తేః |
నాగాత్మకో వా పురుషాత్మకో వా
త్వభేద్యమాద్యం భజ విఘ్నరాజమ్ || 12 ||

పాశాంకుశౌ భగ్నరదం త్వభీష్టం
కరైర్దధానం కరరంధ్రముక్తైః |
ముక్తాఫలాభైః పృథుశీకరౌఘైః
సించంతమంగం శివయోర్భజామి || 13 ||

అనేకమేకం గజమేకదంతం
చైతన్యరూపం జగదాదిబీజమ్ |
బ్రహ్మేతి యం వేదవితో వదంతి
తం శంభుసూనుం సతతం ప్రపద్యే || 14 ||

స్వాంకస్థితాయా నిజవల్లభాయా
ముఖాంబుజాలోకన లోలనేత్రమ్ |
స్మేరాననాబ్జం మదవైభవేన
రుద్ధం భజే విశ్వవిమోహనం తమ్ || 15 ||

యే పూర్వమారాధ్య గజానన త్వాం
సర్వాణి శాస్త్రాణి పఠంతి తేషామ్ |
త్వత్తో న చాన్యత్ప్రతిపాద్యమేతై-
-స్తదస్తి చేత్సర్వమసత్యకల్పమ్ || 16 ||

హిరణ్యవర్ణం జగదీశితారం
కవిం పురాణం రవిమండలస్థమ్ |
గజాననం యం ప్రవిశంతి సంత-
-స్తత్కాలయోగైస్తమహం ప్రపద్యే || 17 ||

వేదాంతగీతం పురుషం భజేఽహ-
-మాత్మానమానందఘనం హృదిస్థమ్ |
గజాననం యన్మహసా జనానాం
విఘ్నాంధకారో విలయం ప్రయాతి || 18 ||

శంభోః సమాలోక్య జటాకలాపే
శశాంకఖండం నిజపుష్కరేణ |
స్వభగ్నదంతం ప్రవిచింత్య మౌగ్ధ్యా-
-దాక్రష్టుకామః శ్రియమాతనోతు || 19 ||

విఘ్నార్గళానాం వినిపాతనార్థం
యం నారికేళైః కదళీఫలాద్యైః |
ప్రతారయంతే మదవారణాస్యం
ప్రభుం సదాఽభీష్టమహం భజేయమ్ || 20 ||

యజ్ఞైరనేకైర్బహుభిస్తపోభి-
-రారాధ్యమాద్యం గజరాజవక్త్రమ్ |
స్తుత్యానయా యే విధివత్స్తువంతి
తే సర్వలక్ష్మీనిలయా భవంతి || 21 ||

ఇతి శ్రీ వక్రతుండ గణేశ స్తవరాజః |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.